Moscow2c

Moscow2c

Moscow2c

రష్యా రాజధాని మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రయాణికుల ప్రవేశద్వారం వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు రష్యా అధికార వార్తాసంస్థ ఇటార్‌-టాస్‌ పేర్కొంది. ఆత్మాహుతి దళ సభ్యుడు చెచెన్యా వేర్పాటువాద గ్రూపులకు చెందినట్టు రష్యన్‌ నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.